ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకోనే కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ గ్లింప్స్‌లో అల్లు అర్జున్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారాల్లో చూపించబోతున్నారని సమాచారం. అట్లీ తనదైన శైలిలో భారీ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సున్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదల కావొచ్చని సమాచారం.
- March 11, 2026
0
4
Less than a minute
You can share this post!
editor


