ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరో. ఆయన సినిమాల్లోకి రావాలనే ఆసక్తి లేకున్నా తన అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ వల్లనే తాను ఇండస్ట్రీకి రావల్సి వచ్చిందని పవన్ పలు సందర్భాలలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిర్మాత అల్లు అరవింద్.. మా అమ్మ వల్లనే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చారని చెప్పారు. అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఇటీవల కన్నుమూశారు. సోమవారం 8న హైదరాబాద్ లో ఆమెకు సంబంధించిన పెద్ద కర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హీరో రామ్ చరణ్ తో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, తన తల్లి గొప్పతనాన్ని స్మరించుకున్నారు.
- September 9, 2025
0
163
Less than a minute
You can share this post!
editor


