అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సందర్బంగా జరిగిన ఇంటర్వ్యూలో హీరో హీరోయిన్స్ అఖిల్ రాజ్, తేజస్విని సినిమా హైలైట్స్ తెలిపారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ…యాక్టర్ కావాలి అనేది నా డ్రీమ్. ఇంటర్ చదివిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. మీడియాలో యాంకర్, ఫొటోగ్రాఫర్ గా వర్క్ చేశాను. యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ చేశాను. వాటిలో సఖియా, ఏవండోయ్ ఓనర్ గారు వంటి షార్ట్ ఫిలింస్ మంచి పేరు తీసుకొచ్చాయి. విందుభోజనం అనే మూవీ చేశాను.
- November 19, 2025
0
48
Less than a minute
You can share this post!
editor

