యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై బజ్ పెంచింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. భావోద్వేగాలు, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మిళితమైన కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌గా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లో ఆయన కొత్త లుక్ ఆకట్టుకుంది. అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచిన ఈ చిత్రం జూన్ 26, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్ కానుందని టీం చెబుతోంది. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
- April 8, 2026
0
5
Less than a minute
You can share this post!
editor

