‘అఖండ 2: తాండవం’ పై భారీ అంచనాలు ఉన్నా, సినిమా వాటిని పూర్తిగా అందుకోలేకపోయింది. బాలయ్య–బోయపాటి కాంబినేషన్ అంటే మాస్ ఫ్యాన్స్‌కు నమ్మకం. కానీ ఈసారి కథ, కథనాలు బలహీనంగా ఉండటం ప్రధాన లోపం. చైనా బయోవార్ నేపథ్యంతో ప్రారంభమైన కథ, ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడికో లాగినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్లో అఖండ ఎంట్రీ మాత్రం థియేటర్‌ను హీట్ చేసింది. సెకండ్ హాఫ్‌లో బాలయ్య అఘోరగా రుద్ర తాండవం ఆకట్టుకున్నా, అధికంగా సనాతన ధర్మం ఉపన్యాసాలు, లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకులను అలసించాయి.
బాలకృష్ణ నటన, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రధాన బలం. హర్షాలి, సంయుక్త పాత్రలు మాత్రం ప్రభావం చూపలేదు. విలన్ ట్రాక్ కూడా బలహీనమే. కెమెరా వర్క్ బాగున్నా, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అత్యంత నిరాశ కలిగించాయి. తమన్ సంగీతం మొదటి భాగంతో పోలిస్తే ఈసారి అట్టడుగు స్థాయిలో ఉంది.
మొత్తంగా, బాలయ్య ఎలివేషన్స్ తప్పితే ‘అఖండ 2’ మిక్స్డ్, యావరేజ్ అనుభవం మాత్రమే. (రేటింగ్: 2.25/5)


