తాండవం మొదలైంది… ‘అఖండ 2’ డ్యాన్స్ సాంగ్ వైరల్!

తాండవం మొదలైంది… ‘అఖండ 2’ డ్యాన్స్ సాంగ్ వైరల్!

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి.  మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. అఖండ 2 సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ నవంబర్ 18న గ్రాండ్ గా లాంచ్  చేయనున్నారు. ఈ సాంగ్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ గా ఉండబోతోంది. తమన్ థియేటర్స్ దద్దరిల్లే పాటని కంపోజ్ చేశారు. గ్రాండ్ సెట్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లో బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ ని అద్భుతంగా అలరించనున్నాయి. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో బాలయ్య ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది. వైజాగ్ జగదాంబ థియేటర్ లో గ్రాండ్ గా జరగనున్న సాంగ్ లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణ తో పాటు చిత్ర యూనిట్ హాజరుకానున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

editor

Related Articles