గాడ్ ఆఫ్ ది మాసెస్ బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాని 3డీ లోనూ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా బిగ్ రివీల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన మీడియా మిత్రులకు, నందమూరి అభిమానులకు, త్రీడీ ఎక్స్‌పీరియన్స్‌ని అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి, అందరికీ ధన్యవాదాలు. బాలకృష్ణ అభిమానులు, ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సినిమాని 3డీ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నాం.
- November 17, 2025
0
10
Less than a minute
You can share this post!
editor

