కొరటాల శివ – బాలకృష్ణ కాంబో ఆన్‌ ది వే..!

కొరటాల శివ – బాలకృష్ణ కాంబో ఆన్‌ ది వే..!

బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ జోష్‌ మీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అఖండ 2లో నటిస్తుండగా.. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దీంతోపాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్‌ యాక్షన్‌ ఫిలింను ప్రకటించాడు. కాగా ఇప్పుడు బాలయ్యకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, దేవర సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.
ఈ డైరెక్టర్‌ నెక్ట్స్‌ బాలయ్యతో ఓ సినిమాను లైన్‌లో పెట్టబోతున్నాడన్న వార్త నెట్టింట మార్మోగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ ప్రశాంత్‌నీల్‌తో చేస్తున్న డ్రాగన్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో మరోవైపు కొరటాల దర్శకత్వంలో టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న సీక్వెల్‌ దేవర 2 ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ కొత్త స్క్రిప్ట్‌లను రెడీచేసే పనిలో ఉన్నాడట. బాలకృష్ణ కోసం ప్రత్యేకించి ఓ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు ఇప్పుడు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమా బాలకృష్ణకు సరిగ్గా సూటయ్యేలా ఉండబోతుందని నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో రాబోతున్న తొలి సినిమా కానుంది.

editor

Related Articles