‘అఖండ 2: తాండవం’ సౌండ్‌ కంట్రోల్లో పెట్టుకో..

‘అఖండ 2: తాండవం’ సౌండ్‌ కంట్రోల్లో పెట్టుకో..

హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తూ శుక్రవారం దీనికి సంబంధించిన పవర్‌ఫుల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేక‌ర్స్‌. ముఖ్యంగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. “సౌండ్‌ కంట్రోల్లో పెట్టుకో.. ఏ సౌండ్‌కి నవ్వుతానో.. ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలీదు కొడకా.. ఊహకు కూడా అందదు…” అంటూ బాలయ్య తనదైన శైలిలో పవర్‌ఫుల్‌ వార్నింగ్‌ ఇవ్వడం గ్లింప్స్‌కే హైలెట్‌గా నిలిచింది. యాక్షన్‌ మోడ్‌లో మొదలైన ఈ గ్లింప్స్‌లో వందలాది రౌడీల మధ్య ఒక్కడే నిలబడి ఉన్న బాలకృష్ణ.. వారిని ఒంటిచేత్తో మట్టికరిపిస్తున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి. గూండా నాయకుడికి వార్నింగ్‌ ఇస్తున్న సమయంలో, వెనుక నుండి గుర్రాలతో అటాక్‌ చేయబోగా.. బాలయ్య ఒక్కసారిగా వెనక్కి తిరగడంతో గుర్రాలు బెదిరిపోయి వెనక్కి వెళ్లిపోవడం గ్లింప్స్‌కే ఊహించని మలుపు. బోయపాటి శ్రీను మేకింగ్‌ స్టైల్‌, ఆయన మార్క్ యాక్షన్, బాలయ్య వ్యక్తిత్వానికి అద్దం పట్టే డైలాగ్స్ అడుగడుగునా కనిపించాయి. ఇక ఎస్. థమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ (ఆర్‌.ఆర్‌) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సంగీతం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

editor

Related Articles