అజ‌య్ దేవ్‌గ‌ణ్ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ట్రైల‌ర్‌ లాంచ్..

అజ‌య్ దేవ్‌గ‌ణ్ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ట్రైల‌ర్‌ లాంచ్..

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా సినిమా సన్ ఆఫ్ సర్దార్. విజ‌య్ కుమార్ అరోరా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. మృణాల్ థాకుర్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ హీరోగా వ‌చ్చిన మర్యాద రామన్న సినిమాను హిందీలో సన్ ఆఫ్ సర్దార్  అని రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ సీక్వెల్‌ రాబోతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ సినిమాను మొద‌ట‌గా జులై 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన చిత్ర‌బృందం అనుకోని కార‌ణాల వ‌ల‌న వారం రోజుల పాటు వాయిదా పడింది. దీంతో ఈ సినిమా జులై 31న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా సినిమా నుండి కొత్త ట్రైల‌ర్‌ను షేర్ చేసింది. దుజా అనే పేరుతో కొత్త ట్రైల‌ర్‌ను లాంచ్ చేసింది.

editor

Related Articles