అడివి శేష్‌ డెకాయిట్‌ లుక్‌ వైరల్

అడివి శేష్‌ డెకాయిట్‌ లుక్‌ వైరల్

టాలీవుడ్‌ హీరో అడివిశేష్  కాంపౌండ్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో ఉన్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి డెకాయిట్‌. అంతా అనుకున్నట్టుగా ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ను ఫిమేల్ లీడ్ రోల్‌లో ఫైనల్ చేశారు. చాలారోజుల తర్వాత సస్పెన్స్‌కు తెరదించుతూ కొత్త లుక్ విడుదల చేశారు. షనీల్‌ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. డెకాయిట్‌ టీం కొత్త పోస్టర్‌లో మృణాల్‌ ఠాకూర్ ఓ చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. మరోచేతిలో పిస్టల్ పట్టుకొని కనిపిస్తోంది. పక్కనే అడివి శేష్ సిగరెట్‌ వెలిగిస్తున్నాడు. అవును వదిలేశాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను.. అడివిశేష్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలియజేసింది మృణాల్‌ ఠాకూర్‌. డెకాయిట్‌లో హీరో హీరోయిన్లిద్దరూ ఏదో మిషన్‌లో పాల్గొంటున్నట్టుగా ఉన్న తాజా పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తోంది.

editor

Related Articles