మ్యాచ్ చూడ్డానికని  వెళితే నటి బ్యాగ్ చోరీ..

మ్యాచ్ చూడ్డానికని  వెళితే నటి బ్యాగ్ చోరీ..

హీరో బాలకృష్ణ సినిమా ఈ మధ్యనే వచ్చిన విషయం మీకు తెలుసు కదా, అందులో డాకు మహారాజ్ పాటకు స్టెప్పులేసిన దబిడి దిబిడి ఐటమ్ సాంగ్‌లో అదిరిపోయే  స్టెప్పులతో ఓ ఊపు ఊపేసిన అందాల ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ బాలీవుడ్ బ్యూటీకి లండన్‌లో ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. వింబుల్డన్ టోర్నీకి హాజరై భారత్‌కు తిరుగు ప్రయాణంలో ఉన్న ఆమె లగ్జరీ సూట్‌కేస్ గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో మాయం కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సూట్‌కేస్‌లో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఊర్వశి తెలిపారు. త‌న‌ విలువైన వస్తువులు గల్లంతవ్వడాన్ని ఊర్వ‌శి త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, వింబుల్డన్ అధికారులను ట్యాగ్ చేశారు.

editor

Related Articles