నాలుగు అపార్ట్‌మెంట్స్‌  అద్దెకు తీసుకున్న అమీర్‌ఖాన్‌..

నాలుగు అపార్ట్‌మెంట్స్‌  అద్దెకు తీసుకున్న అమీర్‌ఖాన్‌..

బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ ‌ ఇటీవలే తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అందుకు కారణం ఆయన వ్యక్తిగత జీవితమే. బాలీవుడ్‌ మహిళా డైరెక్టర్‌ కిరణ్‌ రావుతో విడాకుల అనంతరం అమీర్‌ఖాన్‌ మళ్లీ ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌  అనే మహిళతో కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని అమీర్‌ఖాన్‌ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు మరోసారి ఆయన హెడ్‌లైన్స్‌లో నిలిచారు. అమీర్‌ఖాన్‌ తన సొంత ఇంటిని వదిలి అద్దె ఇంటికి షిప్ట్‌ అవ్వడమే అందుకు కారణం. బాంద్రా వెస్ట్‌లోని పాలి హిల్‌  ప్రాంతంలో నర్గీస్‌ దత్‌ రోడ్‌లో గల విల్నోమోనా అనే సొసైటీలో నాలుగు అపార్ట్‌మెంట్లను అమీర్‌ఖాన్‌ అద్దెకు తీసుకున్నారు. అమీర్‌ఖాన్‌కు విర్గో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఓన్‌గా 12  అపార్ట్‌మెంట్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సొసైటీలో డెవలెప్‌మెంట్‌ వర్క్స్‌ కారణంగా ఆయన అద్దె ఇంటికి షిఫ్ట్‌ అయినట్లు ముంబై మీడియా తెలియజేసింది.

editor

Related Articles