హైదరాబాద్‌లో ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ క‌న్స‌ర్ట్..

హైదరాబాద్‌లో ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ క‌న్స‌ర్ట్..

సంగీత దిగ్గ‌జం, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్ రెహమాన్ అభిమానుల‌కు శుభవార్త‌. హైదరాబాద్‌లో ఆయ‌న క‌న్స‌ర్ట్ జ‌రుగ‌బోతోంది. దాదాపు 8 ఏళ్ల త‌ర్వాత రెహ‌మాన్ హైదరాబాద్​లో మ్యూజిక్ కన్సర్ట్​లో పాల్గొననున్నారు. ఇక ఈ వేడుక‌కు న‌గ‌రంలోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక కానుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ నవంబ‌ర్ 8న జ‌రుగనుండ‌గా.. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు రెహ‌మాన్. రెహ‌మాన్ త‌న‌ 30 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘వండర్‌మెంట్ టూర్’లో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ టూర్‌లో తొలి ఈవెంట్ మే 3న ముంబైలో విజయవంతంగా జరిగింది. కాగా.. రెహమాన్ చివరిసారిగా 2017లో హైదరాబాద్‌లో ఒక మెగా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రదర్శనలూ ఇవ్వలేదు. దీంతో సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్‌లో తన సంగీతంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మ్యూజిక్ క‌న్స‌ర్ట్‌పై రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు. ఫ్యాన్స్ అందరూ గుర్తు పెట్టుకోండి నవంబ‌ర్ 8న నగరంలో రెహమాన్ మ్యూజిక్ సందడే సందడి.

editor

Related Articles