OpenAI సీఈఓని క‌లిసిన ఎ.ఆర్.రెహ‌మాన్..

OpenAI సీఈఓని క‌లిసిన ఎ.ఆర్.రెహ‌మాన్..

సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ తన “సీక్రెట్ మౌంటెన్ ప్రాజెక్ట్” కోసం OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను కలుసుకున్నాడు. ఈ భేటీ వెనుక ఉన్న రహస్యాన్ని రెహమాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆల్ట్‌మన్ ఆఫీసులో ఆయనను కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తాము “సీక్రెట్ మౌంటెన్” అనే తమ వర్చువల్ గ్లోబల్ బ్యాండ్ గురించి చర్చించారని, అలాగే సంగీత రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  టూల్స్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశంపై మాట్లాడినట్లు వెల్లడించారు. భారతదేశంలోని సృజనాత్మక మైండ్స్‌ను ప్రోత్సహించడానికి, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోడానికి AI టూల్స్‌ను వినియోగించడంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామ్ ఆల్ట్‌మన్‌తో దిగిన ఫొటోను కూడా ఎ.ఆర్. రెహమాన్ షేర్ చేశారు. “సీక్రెట్ మౌంటెన్” అనేది ఎ.ఆర్. రెహమాన్ రూపొందించ‌నున్న‌ ఒక డిజిటల్, మల్టీమీడియా ప్రాజెక్ట్. ఇది “మెటా బ్యాండ్”ను కలిగి ఉంటుంది, ఇది సంగీతం, సాంకేతికతతో కలగలిసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను పోగుచేయాలని  రెహమాన్ ఒక లక్ష్యంతో ఉన్నారు.

editor

Related Articles