హీరో అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అడ్వెంచర్ సినిమా ‘డకాయిట్’. మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రేమ – ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ సినిమా ద్వారా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాత. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. నేడు మృణాళ్ ఠాకూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇందులోని ఆమె పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ అవతార్‌ని ప్రజెంట్ చేస్తూ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చేతిలో గన్ పట్టుకుని ఎయిమ్ చేస్తున్న మృణాళ్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఆమె కళ్లల్లో ఆక్రోశం, ముఖంపై చిన్న చిన్న గాయాలు, కళ్లలో కన్నీళ్లు.. ఇవన్నీ ఆమె పాత్రలోని ఉద్వేగాన్ని తెలియజేస్తున్నాయి. ఇందులో జూలియట్ అనే పాత్రను మృణాళ్ పోషిస్తున్నారని, పగతో రగిలిపోతూ ఆమె పాత్ర ఉంటుందని, ప్రస్తుతం హైదరాబాద్‌లో లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాల్ని షూట్ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.

- August 1, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor