చిత్రాలయం సంస్థ నుండి వస్తున్న సినిమా

చిత్రాలయం సంస్థ నుండి వస్తున్న సినిమా

టిను ఆనంద్‌, ఉపేంద్ర, అక్షయ్‌, విష్ణు, కార్తికేయ,  మాళవి ప్రధాన పాత్రధారులుగా చిత్రాలయం స్టూడియోస్‌ పతాకంపై గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనెపూడి నిర్మిస్తున్న సినిమా సోమవారం  ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఆదిశేషగిరిరావు క్లాప్‌ ఇవ్వగా, మరో నిర్మాత కెఎస్‌ రామారావు స్విచాన్‌ చేశారు. ఇంకా నిర్మాతలు కెఎల్‌ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ్‌, పరుచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్‌, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. నేపాల్‌ రాజవంశానికి చెందిన సమృద్ధి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నదని, త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: స్టీఫెన్‌.

editor

Related Articles