ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ లీడింగ్‌లో కొనసాగుతోంది మీనాక్షి చౌదరి. ఈ భామ ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఈ భామ అక్కినేని సుశాంత్‌ను పెళ్లి చేసుకోబోతోందని ఇండస్ట్రీ సర్కిల్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. తాజాగా ఈ వార్తలపై మీనాక్షి చౌదరి క్లారిటీ ఇచ్చేసింది. మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ఈ విషయంపై మాట్లాడుతూ.. తాను కూడా ఈ పుకార్లను విన్నానని చెప్పింది. వెడ్డింగ్ అంటూ వస్తోన్న వార్తలను కొట్టిపారేస్తూ.. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఏదైనా ముఖ్యమైన విషయముంటే అందరితో షేర్ చేసుకుంటానంది. మీనాక్షి చౌదరి ఇటీవలే మట్కాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
- November 20, 2024
0
238
Less than a minute
Tags:
You can share this post!
administrator

