బన్నీ, మహేశ్ బాటలో చరణ్ – ఎన్టీఆర్?

బన్నీ, మహేశ్ బాటలో చరణ్ – ఎన్టీఆర్?

టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ తమ ఉనికిని చాటుతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలో అడుగుపెట్టి విజయవంతంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా చేరనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రచారం ప్రకారం, హైదరాబాద్‌లో ఇప్పటికే ఏఎంబీ, ఏఏఏ, ఏఆర్‌టీ మల్టీప్లెక్స్‌లను నిర్వహిస్తున్న ఆసియన్ సినిమాస్ సంస్థతో రామ్ చరణ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యంతో ‘ఏఆర్‌సీ’ పేరుతో హైదరాబాద్‌లో కొత్త మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు, ఎన్టీఆర్ గచ్చిబౌలి ప్రాంతంలో సొంతంగా ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే ఈ వార్తలపై రామ్ చరణ్, ఎన్టీఆర్ లేదా వారి బృందాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలుగానే ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య మల్టీప్లెక్స్ వ్యాపారంలోనూ పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

Related Articles