కంగనాకు అభిజిత్ స్ట్రాంగ్ రిప్లై

కంగనాకు అభిజిత్ స్ట్రాంగ్ రిప్లై

బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ విద్యార్థులు, నిరసనకారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ కంగనా తాజాగా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయగా, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధినేత అభిజిత్ దిప్కే తీవ్రంగా స్పందించారు. “కంగనాను అసలు ఎవరు సీరియస్‌గా తీసుకుంటారు?” అని ప్రశ్నించిన ఆయన, నీట్ పరీక్షల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. యువత సమస్యలపై మాట్లాడకుండా ఇప్పుడు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.

మరోవైపు, కంగనా తనను “పనికిరాని వ్యక్తి, నిరుద్యోగి”గా అభివర్ణించడంపై కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన గురించి గూగుల్‌లో కనిపించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. గూగుల్‌లోని సమాచారం ఎప్పుడూ పూర్తిగా నిజం కాకపోవచ్చని పేర్కొన్నారు. యువతను, భవిష్యత్ తరాలను కంగనా అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని సౌరవ్ దాస్ విమర్శించారు.

Related Articles