బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ ట్రైలర్ సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ట్రైలర్‌లోని అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్‌లో కనిపించిన ఓ సన్నివేశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడితో పాటు విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడి పాత్రలోనూ కనిపించనున్నట్లు స్పష్టమైంది. వైరల్ అవుతున్న సన్నివేశంలో పరశురాముడు శ్రీరాముడికి విష్ణువు దివ్య ధనుస్సు ‘శారంగం’ సమర్పిస్తున్నట్లు చూపించారు. ఈ పాత్ర కోసం రణ్‌బీర్ పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాని నామిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ తొలిసారి కలిసి సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

