మహిళా కథలకు ప్రాధాన్యం పెరగాలి: మాళవిక

మహిళా కథలకు ప్రాధాన్యం పెరగాలి: మాళవిక

నటి మాళవిక మోహనన్ సినీ పరిశ్రమలో మహిళల పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా పాత్రల్లో నిజమైన మార్పు రావాలంటే కేవలం నటీమణులు మాత్రమే కాకుండా, దర్శకులు, రచయితలుగా కూడా మహిళల సంఖ్య పెరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు, రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. మహిళల కోణంలో కథలు చెప్పే ప్రయత్నాలు మరింత పెరగాలి. మహిళా మేకర్స్ ఎక్కువైతేనే ప్రేక్షకులకు కొత్త తరహా మహిళా పాత్రలు, బలమైన యాక్షన్ కథలు చూసే అవకాశం ఉంటుంది. అప్పుడే మన దగ్గర కూడా ‘కిల్ బిల్’ తరహా సినిమాలు వస్తాయి” అని అన్నారు.

అలాగే, కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ సినిమాని ప్రశంసించిన మాళవిక, ఆ సినిమాలో మహిళా పాత్రలను తీర్చిదిద్దిన విధానం తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. మహిళా దర్శకురాలి దృష్టికోణంలో వచ్చిన ఆ సినిమా ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం మాళవిక మోహనన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కానుంది. అలాగే విజయ్ సేతుపతితో కలిసి ‘పాకెట్ నావెల్’ సినిమాలోనూ మాళవిక నటిస్తున్నారు.

Related Articles