ప్రేమకథతో కిరణ్ మెప్పించాడా?

ప్రేమకథతో కిరణ్ మెప్పించాడా?

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘చెన్నై లవ్‌స్టోరీ’పై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ, భావోద్వేగాలు, ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. ప్రేమలో మోసపోయిన నివి (శ్రీగౌరీ ప్రియ) జీవితంలోకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) రావడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఇద్దరి స్నేహం ప్రేమగా మారినా, విధి వారి జీవితాలను ఊహించని దిశగా తీసుకెళ్తుంది. అదే కథలో ప్రధాన ఆసక్తికర అంశం.

మొదటి భాగంలో ప్రేమకథ, పాత్రల మధ్య భావోద్వేగాలు బాగా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచగా, రెండో భాగంలో ఫాంటసీ ఎలిమెంట్స్ కథను ముందుకు నడిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినప్పటికీ, ప్రీ -క్లైమాక్స్, క్లైమాక్స్ భావోద్వేగంగా మెప్పిస్తాయి.

కిరణ్ అబ్బవరం అమాయకత్వం, ఎమోషనల్ నటనతో ఆకట్టుకోగా, శ్రీగౌరీ ప్రియ తన పాత్రలో సహజంగా నటించింది. త్రిగుణ్ కూడా కీలక పాత్రలో మెప్పించాడు. మణిశర్మ సంగీతం, విశ్వాస్ డేనియల్ ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఓవరాల్‌గా, ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఫాంటసీ టచ్‌తో తెరకెక్కిన ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ. ప్రేమకథలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఒకసారి చూడదగ్గదే.

Related Articles