‘స్పిరిట్’పై సందీప్ క్లారిటీ

‘స్పిరిట్’పై సందీప్ క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై దర్శకుడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. అమెరికాలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TATA) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తైందని వెల్లడించారు.
ప్రతి ప్రేక్షకుడికి నచ్చేలా ‘స్పిరిట్’ను రూపొందిస్తున్నామని, ప్రభాస్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని సందీప్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘స్పిరిట్’ అనౌన్స్‌మెంట్ టీజర్, ఫస్ట్ లుక్‌కు ఇప్పటికే భారీ స్పందన లభించింది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. అతని పాత్ర చుట్టూ సాగే యాక్షన్, ఎమోషనల్ డ్రామా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండనుంది.

ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles