రవితేజతో శ్రీవిష్ణు.. కొత్త మల్టీస్టారర్?

రవితేజతో శ్రీవిష్ణు.. కొత్త మల్టీస్టారర్?

టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మాస్ మహారాజా రవితేజ, యువ హీరో శ్రీవిష్ణు కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి శ్రీవిష్ణుతో రాజరాజ చోర, స్వాగ్ చిత్రాలను తెరకెక్కించిన హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

ఇటీవల హసిత్ గోలి చెప్పిన కథ రవితేజకు నచ్చడంతో ప్రాజెక్ట్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందనున్న ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని భావిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Related Articles