మహేష్-రాజమౌళి మూవీపై కీలక అప్‌డేట్

మహేష్-రాజమౌళి మూవీపై కీలక అప్‌డేట్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ రీ- రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి, ఈ సినిమాకి సంబంధించిన ప్రధాన యాక్షన్ ఎపిసోడ్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు 80 రోజుల టాకీ, బ్యాలెన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026 నాటికి చిత్రీకరణ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా జోనాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కథ ప్రకారం, ఇది శివభక్తుడి చుట్టూ సాగే టైమ్- ట్రావెల్ అడ్వెంచర్ డ్రామా. విశ్వంలోని అత్యంత శక్తివంతమైన వస్తువును అన్వేషించే ప్రయాణం ఈ చిత్రానికి ప్రధానాంశంగా ఉంటుందని సమాచారం.

ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రతో పాటు ప్రత్యేక ఎపిసోడ్‌లో ‘శ్రీరాముడు’గా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రియాంకా చోప్రా ‘మందాకిని’, పృథ్వీరాజ్ ‘కుంభ’ పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారాన్ని రాజమౌళి ఖండిస్తూ, ‘వారణాసి’ సుమారు మూడు గంటల నిడివి గల ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Related Articles