అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘హే చికీతా’. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధన్ రాజ్ లెక్కల దర్శకత్వం వహిస్తున్నారు. అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. టీజర్‌లో ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో పాటు యూత్‌ను ఆకట్టుకునే అంశాలను చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, దర్శకుడు ధన్ రాజ్ లెక్కల, హీరో అభినవ్ మణికంఠ, హీరోయిన్ దివిజ ప్రభాకర్‌తో పాటు సి. కళ్యాణ్, ప్రభాకర్, దశరథ్, గోపీ మోహన్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ, రాజ్ నరేంద్ర, చరణ్ అర్జున్, శివ మల్లాల, దేవీ ప్రసాద్, అవినాష్ తదితరులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

