12 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. కానీ అసలు సర్‌ప్రైజ్ ఇదే!

12 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. కానీ అసలు సర్‌ప్రైజ్ ఇదే!

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ, దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘నేరం’, ‘ప్రేమమ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత దాదాపు 12 ఏళ్లకు వీరిద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమాకు ‘విజయం’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. కేరళలోని ఎర్నాకుళం పద్మ థియేటర్‌లో అభిమానుల సందడి మధ్య టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటోంది. ఈ చిత్రం హీరో నివీన్ పాలీ కెరీర్‌లో 50వ సినిమాగా ప్రత్యేకత సంతరించుకుంది. రేసింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆల్ఫోన్స్ పుత్రన్ కథ, దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. సినీ హోలిక్స్, పాలీ జూనియర్ పిక్చర్స్ బ్యానర్లపై టాన్సన్ టోనీ, సునీల్ రమది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు, విడుదల తేదీ వంటి వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. ఈ క్రేజీ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles