కొనంకి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధతను ప్రతిబింబించే ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్‌లో హీరో కొనంకి కార్తీక్ శక్తివంతమైన భారత సైనికుడి పాత్రలో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. యుద్ధ వాతావరణం, పోరాట దృశ్యాలు, గర్వంగా రెపరెపలాడుతున్న భారత త్రివర్ణ పతాకం పోస్టర్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ’24×7 ఆన్ డ్యూటీ’ అనే ట్యాగ్‌లైన్‌తో దేశ సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వహించే భారత సైనికుల సేవలను ఈ చిత్రం గౌరవించనుంది. ఇందులో కొనంకి కార్తీక్, ప్రియాంక వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రద్ధ ఖత్రి దర్శకత్వం వహిస్తుండగా, కె.వి. నాయుడు కొనంకి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి, మానవీయ విలువల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని చిత్రబృందం తెలిపింది.
- June 27, 2026
0
7
Less than a minute
You can share this post!
editor

