అజిత్ 64వ సినిమాపై ఇంకా సస్పెన్స్

అజిత్ 64వ సినిమాపై ఇంకా సస్పెన్స్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ఆయన 64వ చిత్రం తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, నిర్మాత ఎవరనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.

మొదట ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ నిర్మించనున్నట్లు వార్తలు వచ్చినా, అజిత్ పారితోషికానికి సంబంధించిన చర్చల కారణంగా ప్రాజెక్ట్ ముందుకు సాగలేదనే ప్రచారం వినిపిస్తోంది. అజిత్ రూ.180 కోట్ల పారితోషికం కోరగా, దానిని తగ్గించాలని నిర్మాత కోరినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.

మరోవైపు, అజిత్ తన కొత్త చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కారు రేసింగ్‌లో బిజీగా ఉన్నారు. రేసింగ్ కార్యక్రమాలు పూర్తైన తర్వాత కొత్త సినిమా, నిర్మాణ సంస్థపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles