‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్ర బృందం విడుదల చేసిన రెండో గీతం ‘ప్రియసఖి’ ప్రస్తుతం సంగీత ప్రేమికుల హృదయాలను హత్తుకుంటోంది. ప్రేమలోని మౌన భావాలు, ఆరాధన, అనురాగాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించిన ఈ మెలోడీ శ్రోతలను భావోద్వేగాలకు గురిచేస్తోంది. సురేష్ బనిశెట్టి అందించిన సాహిత్యం ప్రతి ఒక్కరి మనసును తాకేలా ఉండగా, కె.ఎస్. హరిశంకర్ తన మధురమైన గాత్రంతో పాటకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మరోసారి తన మాయాజాలాన్ని చూపిస్తూ హృద్యమైన స్వరాలను అందించారు. లండన్ అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాట విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు మరింత హైలైట్‌గా నిలిచింది. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2026 జూలైలో విడుదల కానున్న ఈ సినిమా యూత్‌ఫుల్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

