కొరటాల ప్లాన్ – బాలయ్యకు మరోసారి అదే హీరోయిన్?

కొరటాల ప్లాన్ – బాలయ్యకు మరోసారి అదే హీరోయిన్?

గాడ్ ఆఫ్ మాసెస్ Nandamuri Balakrishna వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘ఎన్‌బీకే 111’ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, తన కెరీర్‌లో 112వ సినిమాను దర్శకుడు Koratala Siva తో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కోసం కొరటాల ఎలాంటి స్ట్రాంగ్ కథను సిద్ధం చేస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ నటి Vidya Balan నటించబోతుందన్న వార్తలు సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఈ కాంబినేషన్ మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో మరోసారి ఈ జంటను తెరపై చూడాలన్న ఆసక్తి పెరిగింది. అయితే, ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles