‘వీరభద్రుడు’గా సూర్య మాస్ అవతార్..!

‘వీరభద్రుడు’గా సూర్య మాస్ అవతార్..!

తమిళ స్టార్ హీరో Suriya నటిస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ Karuppu తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో రానుంది. ఈ చిత్రాన్ని RJ Balaji తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ Dream Warrior Pictures భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచగా, తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్‌లో సూర్య పవర్‌ఫుల్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో Trisha Krishnan హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, జికె విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. స్కేల్, కంటెంట్ పరంగా భారీగా రూపొందుతున్న ఈ చిత్రం 2026 మే 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Related Articles