కిల్లర్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్..!

కిల్లర్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్..!

‘కిల్లర్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ సై-ఫై థ్రిల్లర్‌గా రూపొందుతోంది. పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, థింక్ సినిమా మరియు AU & I స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ నిర్మిస్తున్నారు. సమర్పకులుగా ఉర్వీశ్ పూర్వజ్ వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో పూర్వాజ్ ఒక సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. హైదరాబాద్‌లో విడుదలైన డా.పూర్వాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. సీఎన్ఏ ఇంటిగ్రేషన్, రాయ్ ప్రోటోకాల్ వంటి కొత్త కాన్సెప్ట్‌లతో ఈ సినిమా రూపొందుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం, పూర్వాజ్ డైరెక్టర్‌గా మరియు నటుడిగా ప్రేక్షకులను మెప్పించబోతోంది.

Related Articles