మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న అవైటెడ్ మూవీ ‘పెద్ది’ షూటింగ్ సమయంలో చిన్నపాటి గాయం కావడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇలాంటి సమయంలో చరణ్ గాయపడ్డాడనే వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అయితే ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం కాదని తెలుస్తోంది. ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన చేసిన ఈ పోస్ట్ అభిమానుల్లో ధైర్యాన్ని నింపింది. ప్రస్తుతం చరణ్ ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. ‘పెద్ది’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఈ ఘటనతో సినిమా మరింతగా చర్చనీయాంశంగా మారింది.
- March 25, 2026
0
5
Less than a minute
Tags:
You can share this post!
editor

