Movie Muzz

ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్తా..?

ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్తా..?

టాలీవుడ్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ ఇప్పుడు మరో నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. ఇకపై తాను నటించే సినిమాల్లో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని ఆమె వెల్లడించింది. ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో సంయుక్త మీనన్ తెలుగులో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన అభిమానులు ఆమె తెలుగు మాట్లాడిన తీరు చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. సంయుక్త మీనన్ మాట్లాడుతూ, మొదట్లో తనకు అసలు తెలుగు రాదని తెలిపింది. అయితే ‘విరూపాక్ష’ సినిమా చేస్తున్న సమయంలో తెలుగు నేర్చుకోవాలని నిర్ణయించుకుని ట్యూటర్ల సహాయంతో భాషను అభ్యసించిందని చెప్పింది. ప్రస్తుతం తెలుగు తన మాతృభాషలాగే అనిపిస్తోందని ఆమె తెలిపింది. టాలీవుడ్‌లో ఇప్పటికే నిత్యామీనన్, సాయిపల్లవి, కీర్తి సురేష్, రష్మిక మందన్న వంటి నటీమణులు తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెబుతూ అభిమానాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సంయుక్త మీనన్ కూడా చేరింది.

Related Articles