Movie Muzz

‘ఈషా’ చాలా కాలంవెంటాడుతుంది..?

‘ఈషా’ చాలా కాలంవెంటాడుతుంది..?

హైదరాబాద్‌లో జరిగిన ‘ఈషా’ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో, హారర్ కాన్సెప్ట్‌ని ఉపయోగించి ప్రేక్షకులను థ్రిల్‌ ఇచ్చే విధంగా ఈవెంట్ రూపొందించబడింది. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా, హెబ్బాపటేల్ కథానాయికగా నటించనున్నారు. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ, హారర్ సినిమాల్లో ఫ్రెండ్స్‌తో థియేటర్‌లో చూడటం మేమ్ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందని, ఈ సినిమా కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని పేర్కొన్నారు. హీరో శ్రీవిష్ణు ప్రీరిలీజ్‌లో బిగ్ టికెట్ లాంచ్ చేశారు. నిర్మాత దామోదర ప్రసాద్ సమర్పకుడిగా ఉండటం, బన్నీ వాస్, వంశీ నందిపాటి సపోర్ట్‌తో మంచి బృందం సినిమాను నిర్మించడంతో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

editor

Related Articles