విషన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా, ఎం.ఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, జె.డి.వి ప్రసాద్, ఆకెళ్ళ గోపికృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా, నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు. ఎస్. హలేష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జివి ఆంజనేయులు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎం నాయుడు మాట్లాడుతూ, నిర్మాతల సహకారంతో సినిమా బాగా రూపుదిద్దుకుందని తెలిపారు. నిర్మాత సుధాకర్ కొమ్మాలపాటి ఇది కుటుంబ సమేతంగా చూసే మంచి ఎంటర్టైనర్ అని అన్నారు. హీరో అమర్దీప్, హీరోయిన్ శైలి చౌదరి ప్రేక్షకుల మద్దతుతో సినిమా విజయం సాధించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు అతిథులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.


