హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ మార్చి 6, 2026న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ చిత్రంలో ‘సామజవరగమన’ హిట్ జోడీ శ్రీ విష్ణు – రెబా మోనికా జాన్ మరోసారి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచగా, తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ విడుదలైంది. భగవద్గీత శ్లోకంతో ప్రారంభమైన ఈ పాటకు కాళ భైరవ అందించిన సంగీతం, అభినవ కవి ర్యాప్, కృష్ణకాంత్ – అభినవ కవి సాహిత్యం జీవితం మరియు సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయి. ఆదిత్య అయ్యంగార్ గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ విష్ణు గ్యాంగ్ ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా రూపొందింది. సినిమాటోగ్రఫీ విద్యాసాగర్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ మనీషా ఎ. దత్ అందించారు. ఈ చిత్రం మరో ఆసక్తికర ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని టీం నమ్మకం వ్యక్తం చేస్తోంది.
- February 26, 2026
0
270
Less than a minute
You can share this post!
editor

