Movie Muzz

ప్రేక్షకులను షాక్ చేసిన ‘గుర్రం పాపిరెడ్డి’ కలెక్షన్స్

ప్రేక్షకులను షాక్ చేసిన ‘గుర్రం పాపిరెడ్డి’ కలెక్షన్స్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన “గుర్రం పాపిరెడ్డి” సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. డార్క్ కామెడీ మూవీ జానర్ లో సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందీ మూవీ. ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లో 2.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఇలాగే పాజిటివ్ ట్రెండ్ కొనసాగిస్తూ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. గుర్రం పాపిరెడ్డి చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ఏపీలో ప్రమోషనల్ టూర్ నిర్వహిస్తున్నారు. నటీనటులు – నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు.

editor

Related Articles