Movie Muzz

యానిమేటెడ్ అడ్వెంచర్: మిషన్ సాంటా – పిల్లల కోసం మజా

యానిమేటెడ్ అడ్వెంచర్: మిషన్ సాంటా – పిల్లల కోసం మజా

ఇటీవల యానిమేషన్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘నరసింహా అవతార్’ తరువాత, ఇప్పుడు మరో యానిమేటెడ్ ఫీచర్ ‘మిషన్ సాంటా’ రిలీజ్ కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న భారతదేశం, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలలో ఒకేసారి థియేటర్లలో వచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధుల చేస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ హై ఎనర్జీ అడ్వెంచర్‌గా, చిన్నారులు, తల్లిదండ్రులు, తాత ముత్తాలు అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. అత్యుత్తమ యానిమేషన్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లింగ్ సాహసాలు ఈ సినిమాకు ప్రత్యేకత ఇస్తాయి. కథ, స్క్రిప్ట్, పాత్రల డిజైన్ లాస్ ఏంజెల్స్‌లో అభివృద్ధి చేయబడి, మొత్తం ప్రొడక్షన్ భారతీయ సీనియర్ యానిమేషన్ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. సుమారు 20 నెలలుగా 150 పైగా నిపుణులు ఈ చిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు. బ్రాడ్‌విజన్ ఇండియా మరియు స్టూడియో56 నిర్మించిన ఈ ప్రాజెక్ట్, భారతీయ యానిమేషన్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది. ఇంగ్లీష్‌లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రీమియం థియేట్రికల్ అనుభవాన్ని అందించనుంది.

editor

Related Articles