ఈషా రెబ్బా, సత్య, రాశీ సింగ్, హర్ష చెముడు, సూర్య శ్రీనివాస్ , సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఆహా ఒరిజినల్స్ వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” సీజన్ 2 స్ట్రీమింగ్ కు వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ గర్ల్స్ గ్యాంగ్ హంగామా చూపిస్తూ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన “4 మోర్ షాట్స్ ప్లీజ్” లాంటి సక్సెస్ అందుకుంటోంది. సంప్రదాయాలను మించిన స్వేచ్ఛను, ఎవరి విమర్శలను పట్టించుకోని స్నేహం, తమదైన ఆశయంతో ముందుకు సాగే ముగ్గురు అమ్మాయిలుగా ఈషా, రాశీ, కుషిత తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. ఈ ట్రెండీ లైఫ్ లో లవ్, కెరీర్, పర్సనల్ స్పేస్ ను కోరుకునే నవతరం తెలుగు అమ్మాయిల జర్నీని ఈ వెబ్ సిరీస్ ఆసక్తికరంగా చూపిస్తోంది. నగరంలో నేటి అమ్మాయిల లైఫ్ ను ప్రతిబింబించేలా “త్రీ రోజెస్” సీజన్ 2 ఉందనే రెస్పాన్స్ ఈ సిరీస్ కు వస్తోంది. “త్రీ రోజెస్” సీజన్ 2 సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరించారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
- December 22, 2025
0
42
Less than a minute
You can share this post!
editor


