Movie Muzz

శంబాల టీమ్ విషెస్ అంటే ఇదే..?

శంబాల టీమ్ విషెస్ అంటే ఇదే..?

ఆదిసాయికుమార్ హీరోగా నటించిన శంబాల సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో కిరణ్ అబ్బవరం గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం చేసిన ఎమోషనల్ స్పీచ్ శంబాల టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్ నింపింది. ఈ వేదికపై ఆయన, ఆది ఫాదర్ సీనియర్ నటుడు సాయికుమార్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కిరణ్ మాట్లాడుతూ, శంబాల మూవీ గురించి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోందని తెలిపారు. ఈ సినిమా ఆది అన్నకు పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకున్నారు. తన కెరీర్ గ్రోత్‌లో సాయికుమార్ గారి పాత్ర ఎంతో కీలకమని, ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాలో ఆయన నటించడం తన జీవితానికే టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ కంటే క్రమశిక్షణే ముఖ్యమని సాయికుమార్ గారు ఎప్పుడూ చెప్పేవారని, ఆ మాటలు తన కెరీర్‌లో ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. దాదాపు 14 ఏళ్లుగా ఆది నిరంతరం సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. చివరగా శంబాల మూవీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

editor

Related Articles