మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా తెలుగు చిత్రం “స్కై” ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త సంగీత దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ ప్రకటించిన ప్రకారం, “స్కై” సినిమా ఈ నెల 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి కథ, భావోద్వేగాలతో కూడిన వినోదం అందించనున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని చిత్రబృందం విశ్వాసంగా చెబుతోంది.
- February 5, 2026
0
54
Less than a minute
You can share this post!
editor


