నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2: ది తాండవం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషంగా ఆకట్టుకుంది.
మ్యూజిక్ అనేది ఒక క్రాఫ్ట్ అని, దానిని బెస్ట్‌గా చేయడమే తన లక్ష్యమని తమన్ తెలిపారు. అఖండ సినిమా తన జీవితానికి బ్యాలెన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. అఖండ 2 కోసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి 73 రోజులు పట్టిందని, శివుడి మంత్రాలపై ప్రత్యేకంగా కృషి చేశామని వెల్లడించారు. సనాతన ధర్మాన్ని కమర్షియల్‌గా ప్రజల ముందుకు తీసుకురావడంలో బాలయ్య, బోయపాటి పాత్ర కీలకమని చెప్పారు. కొత్త వాయిస్‌లకు అవకాశం ఇవ్వడం కూడా ఈ చిత్ర ప్రత్యేకతగా తమన్ పేర్కొన్నారు.


