ఇఈ, రాజయోగం వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు రామ్ గణపతి. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘కాలం’. ఈ సినిమాను శ్రీ నవబాల క్రియేషన్స్, 3 కీజ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మణి లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. మిట్టపెల్లి రాజేష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్ గణపతి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వెంకట సురేష్. ఆర్. రూపొందిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన “కాలం” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో సాయి రోనక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నిర్మాత మణి లక్ష్మణరావు మాట్లాడుతూ – మా “కాలం” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ రోజు మా ఈవెంట్ కు గెస్ట్ లుగా వచ్చిన ఎంఎం శ్రీలేఖ, సాయి రోనక్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో నిర్మించాం. ఉత్తరాఖండ్ నైనిటాల్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపాం. ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే చిత్రమిది. మీరంతా “కాలం” సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు. డైరెక్టర్ వెంకట్ సురేష్.ఆర్. మాట్లాడుతూ – “కాలం” సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం హ్యాపీగా ఉంది.
- December 15, 2025
0
7
Less than a minute
You can share this post!
editor


