Movie Muzz

మైదానంలో ఏం జరగబోతోంది? ‘పతంగ్‌’ ట్రైలర్ చూశారా!

మైదానంలో ఏం జరగబోతోంది? ‘పతంగ్‌’ ట్రైలర్ చూశారా!

ప్రతిష్టాత్మక సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’ ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. పాపులర్‌ దర్శకుడు నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవ కట్టా మాట్లాడుతూ .. ట్రైలర్‌ ఎంతోఎనర్జిటిక్‌,ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. రమ్య ఈ సినిమాకు వన్‌ ఆఫ్‌ ద ప్రొడ్యూసర్‌ అవ్వడం హ్యపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు ఈ సినిమా హీరో ప్రణవ్‌ సరిగమప నుంచి తెలుసు. ఇదొక కొత్తరకమైన సినిమా. ఈ సినిమా చాలా కష్టపడి తీశారు.

editor

Related Articles