ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాన గాంధర్వుడు పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఈనెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఎన్. అచ్యుత రామరాజు, కార్యదర్శి బి. ఎస్. కృష్ణమూర్తి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొని బాలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, సంగీత నాటక అకాడమి చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ గుమ్మడి వెన్నెల, కార్పొరేటర్ పి. విజయారెడ్డి తదితరులు పాల్గొంటారు. బాలు విగ్రహావిష్కరణ అనంతరం రవీంద్రభారతిలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభృతులు ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు పాడుతా తీయగా బాలు నివాళిగా సినీ సంగీత స్వర నీరాజనం ప్రారంభమవుతుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు కీరవాణి, తమన్, సినీ నేపథ్య గాయకులు, బాలు కుటుంబ సభ్యులు పాల్గొంటారు.
- December 13, 2025
0
7
Less than a minute
You can share this post!
editor


