మెగాస్టార్ చిరంజీవి మరియు హిట్ మేకర్ అనిల్ రావిపూడి సంయుక్తంగా రూపొందిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో, నయనతార కథానాయికగా నటిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు, శ్రీమతి అర్చన సమర్పణలో సినిమా రూపొందింది.
సినిమా ఫస్ట్ సింగిల్ భల్లే భల్లే ఇప్పటికే విడుదలై యువ ప్రేమ, హ్యాపీనెస్, ఫ్యామిలీ ఎమోషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. చిరంజీవి మరియు వెంకటేష్ మధ్య ప్రత్యేక కామెడీ సీన్స్, వింటేజ్ మెగాస్టార్ ఎంట్రీ, ఫన్, ఎమోషన్, యాక్షన్ అన్ని అంశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతి సీన్‌లో ఆడియన్స్ ముఖంలో చిరునవ్వు ఉంటుంది.
సెన్సార్ రిపోర్ట్ క్లిన్ మరియు ఫ్యామిలీ ఫ్రెండ్లీగా వచ్చింది. ఫ్యామిలీ, పిల్లలతో కలసి చూడదగ్గ, ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. సంక్రాంతి స్పెషల్ విందుగా, ప్రతి ప్రేక్షకుడు సినిమాను ఆస్వాదించబోతున్నారు.


