Movie Muzz

ఐదుగురు భర్తలు… ఒకే మహిళ… చరిత్రలోనే సంచలన కథ..?

ఐదుగురు భర్తలు… ఒకే మహిళ… చరిత్రలోనే సంచలన కథ..?

రాయల్ త్రోన్ ప్రొడక్షన్స్ మరియు ఓం సాయి రామ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ట్రెండీ కామెడీ చిత్రం ‘పాంచాలి పంచ భర్తృక’ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటకిరీటి రాజేంద్రప్రసాద్ అధికారికంగా విడుదల చేశారు. దర్శకుడు గంగ సప్తశిఖర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి లెస్ లాజిక్, మోర్ మ్యాజిక్ అనే క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ సినిమాలో వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, జెమినీ సురేష్, ర్యాప్ సింగర్ రోల్ రిడా హీరోలుగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ కనిపించనున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ) నిర్మాతగా వ్యవహరిస్తుండగా, శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మన్యం సహ నిర్మాతలుగా ఉన్నారు.

టైటిల్ లాంచ్ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇది కొత్త కథతో రూపొందిన సరదా కామెడీ సినిమా అని తెలిపారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, మహేశ్ నారాయణ, బిషేక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాబీ కేఎస్‌ఆర్ కథను అందించగా, రాజ్ పవన్ స్క్రీన్‌ప్లే రాశారు. ‘పాంచాలి పంచ భర్తృక’ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Related Articles